టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'అందాల రాక్షసి'  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన స్టైల్లో అభిమానాన్ని సొంతం చేసుకుంది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక లావణ్య త్రిపాటి ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాగా..గత సంవత్సరం ఈమె చావు కబురు చల్లగా అనే సినిమాలో నటించింది. యువ హీరో కార్తికేయజోడి గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ప్రస్తుతం 'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాలో నటిస్తోంది.  

లావణ్య త్రిపాటి నటించిన చావు కబురు చల్లగా అనే సినిమా ఆమెకు నిరాశ మిగల్చడంతో ప్రస్తుతం తాను నటిస్తున్న హ్యాపీ బర్త్ డే చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది లావణ్య. అయితే ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం  గత కొద్దిరోజుల నుంచి ఈమె పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ బ్యూటీ గత కొన్ని సంవత్సరాల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరికీ సంబంధించి సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నప్పటికీ ఈమె ఏమాత్రం స్పందించక పోవడంతో ఈ వార్త నిజం అని నమ్ముతున్నారు.

తాజాగా ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈమె పెళ్లి విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈమె పెళ్లి ప్రస్తావన గురించి మాట్లాడటానికి ఇష్టపడదు..అయితే  అభిమానులు పదేపదే తన పెళ్లి గురించి అడగడంతో ఈ విషయంపై స్పందించారు లావణ్య త్రిపాఠి.ఇక తాజాగా ఈమె  స్పందిస్తూ కొంతమంది ఎలా చేస్తారో.. నా పెళ్లి గురించి నాకు కూడా తెలియదు..... అంటూ చెప్పడంతో ఈమె పెళ్లి గురించి వస్తున్న వార్తలకు లావణ్య ఈ విధంగా చెక్ పెట్టారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: