మనిషి డబ్బు సంపాదించడానికి ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్కరు తమ నైపుణ్యానికి తగినట్లుగా ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అదే విధంగా సినిమా లను నిర్మించి డబ్బు సంపాదించడం కూడా ఒక ఆదాయ మార్గం అని చెప్పాలి. మన ఇండియన్ సినిమాలో సినిమా పరిశ్రమ పెద్ద స్థాయిలో ఉండేది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలోనే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో రకమైన మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ ను బట్టి నిర్మాతలు సినిమాలను నిర్మించి సోము చేసుకుంటారు. ప్రస్తుతం తెలుగులో అయితే దిల్ రాజు, సురేష్ బాబు, నాగార్జున, అశ్వనీదత్, రాఘవేంద్రరావు లాంటి సీనియర్ నిర్మాతలు ఉన్నారు. 

వీరు సినిమాలను నిర్మించాలంటే వందల కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. అలాగే కొన్ని చిన్న సినిమా లను నీరిమించే నిర్మాతలు సైతం ఉన్నారు. ఈ మధ్య హీరోలు కూడా సెపరేట్ గా నిర్మాణ రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ ను అందుకుంటున్నారు. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో ఈ మధ్య కరణ్ జోహార్ తర్వాత వినిపిస్తున్న నిర్మాత పేరు బోనీ కపూర్. ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ అందాల నటి అతిలోక సుందరి శ్రీదేవి భర్త అని తెలిసిందే. ఈయన ఒకప్పుడు నిర్మాతగానే ఉన్నాడు, కానీ కొద్ది కాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ జోరు మీదున్నాడు. గతంలో వచ్చిన వకీల్ సాబ్ మూవీ నుండి బోనీ ఒక నిర్మాతగా స్పీడ్ అందుకున్నాడు. 

హిందీ మూవీ పింక్ కి రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించి నిర్మాతలకు బోలెడు లాభాలను తెచ్చిపెట్టింది. ఆ విజయం ఇచ్చిన బలంతో ఇప్పుడు వరుసగా అయిదు సినిమాలను లైన్ లో పెట్టి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు. మాములుగా ఒక హీరో అయిదు సినిమాలు వరుసగా చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఒక నిర్మాత వరుసగా ఐదు సినిమాలు నిర్మించడం సాధారణ విషయం కాదు. కానీ బోనీ కపూర్ ఒంటి చేత్తో ఈ పని చేస్తున్నాడు . అందులో మూడు తమిల్ సినిమాలు ఉండగా రెండు హిందీ మూవీలు ఉన్నాయి. అజిత్ హీరోగా నటించిన వాలిమై ఈ నెల 24 న విడుదల కానుంది. ఇదికాకుండా నెంజుక్కునీధి, వీట్లవిశేషంగా, మైదాన్ మరియు మిలి అనే చిత్రాలను లైన్ లో పెట్టాడు. మరి మిగతా సినిమాలపై మనకు నమ్మకం కలగాలంటే ముందుగా అజిత్ వాలిమై హిట్ కావాల్సి ఉంది. ఈ సినిమాలు అన్నీ కూడా ఈ సంవత్సరమే రిలీజ్ కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: