ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మేనియా ఇప్పుడు జనాలందర్ని ఉర్రూతలోగిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప పాటలు, డైలాగులే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తాన్నే పుష్ప రాజ్ షేక్ చేస్తున్నాడు. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా పుష్ప డైలాగులు, మేనరిజం, డాన్స్ స్టెప్పులే  కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీలు దాకా ఎంతోమంది పుష్ప ఫీవర్ కి కనెక్ట్ అయిపోతున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాలోని పాటల పై ఎంతోమంది సెలబ్రిటీలు డాన్స్ స్టెప్పులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో చెప్పనవసరం లేదు. 

అయితే తాజాగా ఇప్పుడు హైదరాబాద్ కి చెందిన మృణాళీ కిరణ్ అనే డాన్సర్ అచ్చు అల్లుఅర్జున్ లాగే స్టెప్పులేసి అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.పుష్ప సినిమాలోని 'సామీ.. సామీ..' పాటకు అర్జున్ అల్లు అర్జున్ లాగే కాస్ట్యూమ్స్ ధరించి అదే తరహాలో అదిరిపోయే స్టెప్పులేసింది ఈ డాన్సర్. ముఖ్యంగా ఈ వీడియోలో అల్లు అర్జున్ లాగే అదే ఎనర్జీ, అదే స్టైల్ లో బన్నీని ఎక్కడ తగ్గకుండా డాన్స్ చేసింది. 'అల్లు అర్జున్ సార్ డాన్స్ రిక్రియేషన్' అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మృణాళీ కిరణ్. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు ఇప్పటివరకు 25 వేల పైచిలుకు వీక్షణలు వచ్చాయి.

 ముఖ్యంగా వీడియోలో ఈమె డాన్స్ ని చూసి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.'మీ డెడికేషన్ కి నమస్కారం అండి' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'టాప్ రేంజ్ పర్ఫామెన్స్' అని మరొకరు.. 'మృణాళి అంటే డాన్సర్ కాదు క్రాకర్' అంటూ మరో నెటిజన్ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ ఈమె డాన్స్ ని తెగ పొగిడేస్తున్నారు. అయితే గతంలోనూ ఈమె అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులేసి అదరగొట్టింది. అప్పట్లో డీజే సినిమాలోని 'గుడిలో బడిలో మదిలో' పాటకు అల్లుఅర్జున్ స్టెప్పులను మళ్ళీ రీ క్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు మరోసారి సామి సామి పాటకి అచ్చుగుద్దినట్టు అల్లు అర్జున్ లా డాన్స్ వేసి సోషల్ మీడియాలో నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: