ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో సమంత  ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే తన అందం మరియు అభినయంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం సమంత  ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏లో రాజీ పాత్రలో నటించి పాన్ ఇండియన్ స్టార్‏గా పాపులారిటీని కూడా  సంపాదించుకుంది.  అయితే తాజాగా సమంత మరియు నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. విడాకుల అనంతరం సమంత ఏదో ఓక విషయమై వార్తల్లో నిలుస్తుంది.

  ఇక ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది.ఇక తాజాగా సమంత స్వీట్జర్లాండ్ ట్రీప్ ఎంజాయ్ చేస్తూ స్కైయింగ్ చేస్తున్న వీడియోలను నెట్టింట్లో షేర్ చేసింది. సమంతకు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే కేవలం యూత్ మాత్రమే కాదు.. చిన్నారుల్లోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.అయితే  తాజాగా  ఓ పాపను పెద్దయ్యాక ఏమవుతావు అని అడగ్గా.. సమంత అవుతానని చెప్పి అందరికీ షాకిచ్చింది. దీనితో అందరూ షాక్ అయ్యారు... ఈ వీడియోను కీర్తి సురేష్ తన ఇన్ స్టాలో షేర్ చేయడం జరిగింది.

కీర్తి సురేష్ తన సినిమా షూటింగ్ సెట్ లో ఉండగా.. అక్కడే ఉన్న చిన్నారితో మాటలు కలిపింది. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అదిగింది... అయితే సమంత అవుతాను అని చెప్పింది. ఇక ఆ చిన్నారి సమంతకు వీరాభిమనిని అని చెప్పింది. అయితే ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది కీర్తి సురేష్.” సమంత మీ అభిమాని.. మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి సామ్ ” అని ఇంస్టాగ్రామ్ లో క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఈ వీడియోకు సమంత రిప్లై ఇస్తూ.. ఎవరు ఈ క్యూటీ అంటూ ప్రశ్నించింది కూడా...ఇక  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: