అక్కినేని అఖిల్ కెరియర్ లో ఫస్ట్ టైం బ్యాచిలర్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో అఖిల్ ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఏజెంట్ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్యా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇన్నాళ్లు ఈ సినిమా ని తెలుగు లో మాత్రమే రిలీజ్ చేస్తారని అనుకోగా ఇప్పుడు అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ వస్తున్న సందర్భంగా ఈ క్రమంలో ఏజెంట్ సినిమాని కూడా నేషనల్ వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సైరా నరసింహా రెడ్డి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైంది.

సురేందర్ రెడ్డి చేస్తున్న ఏజెంట్ కూడా తెలుగు తో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా అఖిల్ ఏజెంట్ కి ఇది ఓ మంచి అవకాశమని చెప్పొచ్చు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న అఖిల్ ఏజెంట్ సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. అఖిల్ ఏజెంట్ తో తన సక్సెస్ మేనియా కొనసాగిస్తాడేమో చూడాలి. అఖిల్ ఏజెంట్ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.  అక్కినేని ఫ్యాన్స్ ని మాత్రమే కాదు ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఏజెంట్ వస్తుందని తెలుస్తుంది. మరి అఖిల్ ఏజెంట్ ఆశించిన రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: