సమంత ఈ మధ్య కాలంలోనే ఎంత పాపులారిటీని సంపాదించుకుంది మనందరికీ తెలిసిన విషయమే. అయితే తన ఇంత తక్కువ కాలంలోనే పాపులారిటీని సంపాదించడానికి రెండు కారణాలున్నాయి. మొదటగా సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకోవడం అయితే రెండవది ఇటీవల కాలంలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న పుష్ప సినిమాలోని సమంత ఐటమ్ సాంగ్. ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.అయితే పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.  

అయితే సమంత టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ మరియు హాలీవుడ్ లలో చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సామ్ ఎక్కువ తన సమయాన్ని ముంబై లోనే గడుపుతూ ఉంది.. అయితే ఈ మధ్య అక్కడే గడుపుతూ ఫోటోలు షేర్ చేస్తుంది.. ఇక మరొకసారి సమంత ముంబై నుండి ఒక ఫోటో వెలువడింది. అయితే తాజాగా సమంత తన సహా నటి వరలక్ష్మి శరత్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ తో కలిసి లంచ్ డేట్ కి వెళ్లిన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సమంత ఫ్రెండ్ వరలక్ష్మీ దానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసింది ఇక ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ముగ్గురు కలిసి లంచ్ కి వెళ్లడం వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఈ ఫోటోలో మాత్రం చాలా అందంగా కనిపిస్తోంది.అయితే సమంత కొత్త హెయిర్ స్టైల్ చేయించుకుంది.. అంతేకాకుండా ఇది ముంబై లో ఒక లగ్జరీ సెలూన్ డిజైన్ చేయించిన హెయిర్ స్టైల్.. ఇక ఈ హెయిర్ స్టైల్ ఆమెకే కాకుండా  ఆమె అభిమానులకు కూడా బాగా నచ్చింది.. ఈ ఫోటోలో సామ్ ఈ కొత్త హెయిర్ స్టైల్ తో మరింత అందంగా కనిపిస్తుంది. అన్నట్టు సమంత నటిస్తున్న 'యశోద' సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది...!!



మరింత సమాచారం తెలుసుకోండి: