దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలను తెరకెక్కించాడు.తాజాగా వెంకటేష్ నారప్ప రీమేక్ తో మాస్ టచ్ చేశాడు. అయితే తాజాగా బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథను సిద్ధం చేసుకున్నాడని.. ఇప్పటికే బాలయ్యకి ఆ కథ కూడా వినిపించాడని  ఆ మధ్యలో  టాక్ నడిచింది. అయితే ఆ చర్చలు ఏమయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దగ్గుబాటి రానా తో సినిమా ప్రయత్నాలలో ఉన్నాడట. అంతేకాకుండా ఆ మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కూడా శ్రీకాంత్ అడ్డాలసినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఇక ఈ విషయం పక్కనపెడితే ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దగ్గుబాటి రానా కోసం కథను పూర్తి చేశాడని ఆ కథను కూడా వినిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి . ఇక అసలు నిజానికి వస్తే  బాలయ్యతో సినిమాకు శ్రీకాంత్ వెనుక దిల్ రాజు ఉండే తతంగం నడిపించాడని.. ఆ సినిమాను దిల్ రాజే నిర్మించనున్నాడని చెప్పుకున్నారు. అయితే బాలయ్య మాత్రం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు లేదా అన్న విషయం మాత్రం తెలియదు. అయితే ఆ సినిమాతో పాటు రానాతో మరో సినిమాకి శ్రీకాంత్ సిద్దమవుతున్నాడు. 

అంతేకాకుండా ఈ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించనున్నాడని తెలుస్తుంది. అయితే రానా కోసం ఎలాంటి కథను ఎంచుకున్నాడు.. ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది చూడాలి.ఇకపోతే రానా ఇటీవల నటించిన విరాటపర్వం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది వాయిదా పడింది వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా సరసన హీరోయిన్ గా నటించగా ప్రియమణి మరో కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: