అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఇప్పటివరకు నిత్యం ఏదో ఒక వార్తలో ఈ జంట వార్తల్లో నిలుస్తున్నారు. వారు విడాకులు తీసుకుని ఎంతకాలమైనా నా ఏదో ఒక విషయమై సమంతను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే సమంత మాత్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఒక సమంత ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తన ఫ్రెండ్స్ తో అకేషన్ కి వెళుతూ చాలా హ్యాపీగా ఉంది. అయితే తాజాగా విడాకుల తర్వాత చైతూ గురించి ఎప్పుడు మాట్లాడని సామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాజీ భర్త క్యారెక్టర్ ని బయటపెట్టింది.  

ఇక ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సమంత తన వద్ద డబ్బులు లేని సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి చైతూ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సమంతాకు ఒకానొక సమయంలో నేను చైతన్యతో కలిసి షూటింగ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్ చేసి మాట్లాడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు.... అయితే ఏమాత్రం ఆలోచించనే చైతు అప్పుడు నా పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆయన.. వెంటనే నా దగ్గరకు వచ్చి తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది.  అంతేకాకుండా  చైతన్య మాత్రం పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్.. ఫైన్షియల్ గా చైతూ తనను ఆదుకున్నాడని ' చెప్పుకొచ్చింది సమంత.

ఇక నిజం చెప్పాలంటే సామ్ ని చై అర్ధం చేసుకున్నట్లు మరెవ్వరు అర్ధం చేసుకోలేదంటే అతిశయోక్తి కాదట. ఇక ఇలాంటి జంట విడిపోయారు అంటే నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ జంట సినిమాల విషయానికొస్తే సామ్ ప్రస్తుతం శాకుంతలం తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.. ఇక చై థాంక్యూ, లాల్ సింగ్ చద్దా చిత్రాలతో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు.నాగచైతన్య నటిస్తున్న వెబ్ సిరీస్ కి దూత అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: