తన విడాకుల తర్వాత సోషల్ మీడియా లో ప్రస్తుతం  సమంత ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో తెలిసిందే. అయితే సమంత ఒకవైపు తన పర్సనల్ విషయాల తోనూ మరియు మరొకవైపు తన సినిమా కెరీర్ పరంగానూ దూసుకు పోతోంది. ఇక సమంత అక్కినేని నాగార్జున తో విడాకుల తరువాత తన సినిమా జీవితం లో బిజీగా ఉంది. ప్రస్తుతం సమంత భారీ సినిమాలతో మన ముందుకు రానుంది. టాలీవుడ్ తో పాటు హాలీవుడ్లో కూడా సమంతకు అనేకమైన ఆఫర్లు వస్తున్నాయి.ఇక నాగ చైతన్యతో గతేడాది అక్టోబర్‌లో సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.  

అయితే విడాకులు తీసుకున్న తరువాత నుండి  ఏ వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ జంటకు టాలీవుడ్‌ క్యూటెస్ట్‌ కపుల్‌ అని కూడా పేరు ఉండేది. ఇక అసలు విషయానికొస్తే సమంత తన ప్రెగెన్సీపై గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. గతంలో 2019లో సామ్ సోషల్‌ మీడియా వేదికగా లైవ్‌ చాట్‌లో పాల్గొంది.  అయితే అప్పట్లో సామ్ ఆస్క్‌ మి ఎనీ థింగ్‌ అంటూ ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేసింది సామ్.  అయితే అందులో భాగంగా ఫ్యాన్స్‌ నుంచి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక ప్రశ్న సమంతకు ఎదురైంది.  

ఇక దానికి సమాధానం ఇస్తూ సమంత 2022 సంవత్సరం ఆగస్టు 7న ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు తాను ఒక బిడ్డకు జన్మనిస్తానంటూ  చెప్పుకొచ్చింది. ఇక సమంత అప్పుడు చేసిన   ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాల్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వీరు అభిమానులు నాగ చైతన్య మరియు సమంత బంధం బాగుండి ఉంటే.. సమంత చెప్పినట్లుగానే ఈ పాటికి వారికి నిజంగానే ఒక బిడ్డ జన్మించేవారు కదా అంటూ  కామెంట్స్‌ చేస్తున్నారు.  ఇక ప్రస్తుతం సమంత తెలుగులో వేషధారణ సినిమాలో నటిస్తోంది ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది సమంత...!!

మరింత సమాచారం తెలుసుకోండి: