తెలుగు సినీ ప్రేక్షకులకు అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ తమిళ డబ్బింగ్ సినిమా అయినా జర్నీ తో టాలీవుడ్ లో మంచి పేరు ను సంపాదించుకుంది.  ఆ తర్వాత టాలీవుడ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది,  ఆ తర్వాత బాలకృష్ణ,  వెంకటేష్ లాంటి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి అంజలి ప్రేక్షకుల అలరించింది. బాలకృష్ణ,  వెంకటేష్ లాంటి హీరోలతో నటించిన సినిమాలు కూడా అంజలికి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను తెచ్చిపెట్టాయి, అంజలి తమిళ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలలో నటించి కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. 

అంజలి కేవలం కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా గీతాంజలి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది,  హారర్ కామెడీగా కాన్సెప్ట్ తో తెరకెక్కిన గీతాంజలి సినిమా అంజలి కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  పాన్ ఇండియా సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అంజలి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఇలా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే అంజలి తన ఇన్ స్టా లో తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అంజలి క్లాస్ లుక్ లో పింక్ కలర్ డ్రెస్ ను ధరించి పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్ వండర్ఫుల్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: