టాలీవుడ్ సీనియర్ శ్రీకాంత్ సీనియర్ హీరోయిన్ ఊహాల గారాల పట్టి మేధ. ఈ దంపతులకు ఈమె ఒకే ఒక్క కుమార్తె. ఇద్దరు కుమారులు రోషన్ ఇంకా రోహన్. ఇక వీరిద్దరి నడుమ మేధ ఎంతో గారాబంగా పెరిగింది.ఇక మేధ అచ్చం తన తల్లికి అచ్చు గుద్దినట్లే ఉంటుంది.తండ్రి పోలికలు అక్కడక్కా కనిపిస్తాయి. ఇటీవలే మేధ తన స్కూలింగ్ పూర్తిచేసి కాలేజీలో లైఫ్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం స్టడీస్ పైనే తన ఏకాగ్రత పెట్టింది.ఈమధ్యనే శ్రీకాంత్-ఊహా 25వ మ్యారేజ్ యానివర్సరరీ జరిగింది. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి ఈ జంట ఎంతో ఆనందంగా గడిపింది.ఆ టైంలోనే మేధ కొత్త ఫోటో ఒకటి బయటకు వచ్చింది. రోహన్ ఇంకా రోషన్ మద్యలో మేధ నిలబడి కెమెరాకి ఫోజులిచ్చింది. ఇందులో మేధ ఫుల్ హ్యాండ్స్ టీ షర్టు ధరించి అచ్చం చిలకలా నవ్వుతోంది.ఇక సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఇక మీడియాలో అంతగా శ్రీకాంత్ ఫ్యామిలీ కనిపించదు. ఇలా ఒక్కసారిగా మేధ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె అందానికి నెటిజన్స్ ఫుల్ గా ఫిదా అయిపోతున్నారు.

ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా? అన్న సందేహాలు ఇప్పుడే మొదలయ్యాయి.అయితే మేధ చదువుకుంటుంది కాబట్టి ఇప్పుడల్లా ఇది సాద్యపడదు. పైగా ఫ్యామిలీనే ఈ విషయం నిర్ణయించాలి. మరి శ్రీకాంత్ డెషిషన్ అనేది ఇక ఎలా ఉండబోతుంది? అని విశ్లేషిస్తే...శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు తన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లోకి తీసుకురానని..పరిశ్రమ అనేది ఎలా ఉందో తనకి బాగా తెలుసునని..చాలా టఫ్ కాంపిటీషన్ నడుమ మేకప్ వేసుకుని తీసివేయాల్సిన పరిస్థితులు వస్తే? ఎలా ఉంటుందో అనేది తనకు బాగా తెలుసు కాబట్టి ఇండస్ర్టీకి రానివ్వని అన్నారు.కానీ రోషన్ విషయంలో మాత్రం అసలు అలా జరగలేదు. తండ్రి ప్రోత్సాహాంతోనే అతను ఎంట్రీ ఇచ్చాడు. రెండు సినిమాలు కూడా చేసాడు. ఇటీవలే `పెళ్లి సందడి` సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మేధ విషయంలో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉందా?అంటే అది అంత సులభం మాత్రం కాదు. రోషన్ కుమారుడు కాబట్టి చాలా సులభంగా ఎంట్రీ జరిగింది. కానీ మేధ కుమార్తె కాబట్టి ఎంట్రీ విషయంలో చాలా విషయాలు అనేవి ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది. కుమారుడు రోషన్ విషయంలో అంత డీప్ గా ఆలోచన చేసిన శ్రీకాంత్ కుమార్తె విషయంలో అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: