అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ప్రియాంక జవాల్కర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఇలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ  పోయిన సంవత్సరం కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాతో పాటు సత్య దేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు సినిమాలో కూడా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది, ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకున్నాయి.

 ఇలా సినిమాలతో ఎప్పటికప్పుడు  ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది,  అది మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ను తన గూగుల్ హిస్టరీ చూపించమని ఎవరో అడిగారట,  ఈ విషయంపై స్పందించిన ప్రియాంక జవాల్కర్...  రాత్రి తను సెర్చ్ చేసిన వాటిని  స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది, ఈ పోస్ట్ లో ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ నాసా, మల్టీవర్స్, టైం ట్రావెల్, పారలల్, యూనివర్స్ వర్సెస్ మల్టీవర్స్, జీమెయిల్, అనురాగ్ కశ్యప్ ఇలా రకరకాలుగా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరో అడిగారు.. కానీ ఎందుకు అడిగారు అంటూ ప్రియాంక జవాల్కర్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది, ఇలా ప్రియాంక జవాల్కర్ తన గూగుల్ హిస్టరీ తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: