టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు తమిళనాట స్వీటికి ఒక రేంజిలో క్రేజ్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వుంది ..ఆ క్రేజ్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే ఒకప్పుడు బిజీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం కుర్ర హీరోయిన్స్ పోటీ ఎక్కువయ్యి అడపా దడపా మాత్రమే సినిమాలలో కనిపిస్తుంది.కుర్ర హీరోయిన్లు పోటీకి ఎంత మంది  వచ్చిన కాని తను చేసిన పాత్రలతో ఆమె ఎప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుంది.ఇక ఒక సినిమా కోసం బరువు పెరిగిన ఈ హాట్ బ్యూటీసినిమా తరువాత తగ్గడానికి ప్రయత్నించి కొంత సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాలో నటిస్తున్న స్వీటీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి హాట్ కామెంట్స్ చేసింది. 'సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఛాన్స్ లు ఇస్తామని హీరోయిన్లను లోంగబర్చుకొనే సంస్కృతి టాలీవుడ్ లోనూ ఉంది.

ఇక నేను కూడా చూశాను అలాంటివి. ఇలాంటివి ఈ ఒక్కచోటే కాదు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి.ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడతాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురుకాలేదు. అవును టాలీవుడ్ లో కూడా ఈ లైంగిక వేధింపులతో హీరోయిన్స్ ఇబ్బంది పడుతున్నారు అనే నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇక నా మనస్తత్వం తెలిసి నా దగ్గర ఎప్పుడు ఎవరు కూడా ఇలా అడగలేదు'. అని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దర్శనమిచ్చే ఈ ఈ హాట్ బ్యూటీ సడెన్ గా క్యాస్టింగ్ కౌచ్ పై ఇలాంటి హాట్ కామెంట్స్ అనేవి చేయడం ఏంటా అని అందరు కూడా తలలు బాదుకుంటున్నారు. మరి అనుష్క ఇలా మాట్లాడం వెనుక అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: