బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్‌ ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రతి కొత్త సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాల కోసం భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారు.ఇలా  భారీగా నిర్మిస్తోన్న ప్రభాస్‌ అప్‌కమింగ్‌ మూవీల్లో ఆదిపురుష్‌ సినిమా ఒకటి. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్‌ ప్రభాస్‌తో ఆదిపురుష్‌ మూవీని  తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరుకెక్కుతోన్న ఆదిపురుష్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ మూవీలో ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపించనున్నారు.  

ఇక హీరోయిన్ విషయానికి వస్తే బాలీవుడ్ హీరోయిన్‌ ప్రభాస్‌ సరసన నటిస్తోంది. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి చాలా భాగం కూడా షూటింగ్‌ పూర్తి అయింది.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్‌ చేయాలనుకున్న మూవీ యూనిట్‌.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.అయితే అమీర్ ఖాన్ లాల్‌సింగ్‌ చద్ధా మూవీ వల్ల ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయింది.  అయితే గతేడాది లాల్‌సింగ్‌ చద్ధా సినిమా  రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.

కాగా లాల్‌సింగ్‌ చద్ధా సినిమా మరోసారి వాయిదా పడింది.అయితే ఈ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ కూడా వచ్చేసింది.... ఆగస్టు 11వ తేదీన లాల్‌సింగ్‌ చద్ధా మూవీ రిలీజ్‌ కానుందట.కాగా అదే రోజు ఆదిపురుష్‌ మూవీ రిలీజ్‌ కావాల్సి ఉందట.. కానీ లాల్‌సింగ్‌ చద్ధా మూవీ కోసం ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్టుగా సమాచారం.  ఇదిలా ఉంటే అద్వైత్‌ చందన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన లాల్‌సింగ్‌ చద్ధా సినిమాలో  నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించారు. తరువాత ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: