తమిళ హీరో సూర్య కి అటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. తమిళంలో ఎన్నో సినిమాలతో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సూర్య తెలుగులో కూడా తన సినిమాలను డబ్బింగ్ చేసి ఇక్కడ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ఇక తన సినిమాల అన్నింటినీ కూడా తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే జై భీమ్ అనే ప్రయోగాత్మకమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు సూర్య. ఇక అంతకుముందు ఆకాశమే హద్దుగా అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు.


 ఇలా వరుసగా బయోపిక్ ల తో అలరించిన హీరో సూర్య ఇక ఇప్పుడు మాత్రం మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన పోయాడు. సూర్య నటించిన ఈటి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నాడు అనే విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  ఈ సినిమా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. కళానిధి మారన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇక విలక్షణ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.


 ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం సూర్య తన అభిమానులందరికీ సర్ప్రైస్ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుస్తుంది. సూర్య నటిస్తున్న ఈటి సినిమా టీజర్ నేడు సాయంత్రం విడుదల కాబోతుంది. దీంతో అభిమానులు అందరూ ఈ టీజర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం తెలుగు తమిళం కన్నడ భాషల్లో మాత్రమే తన సినిమాలను విడుదల చేసిన సూర్య ఈటి సినిమాను హిందీలో కూడా అదే టైటిల్ తో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: