సినిమా పరిశ్రమలో పెద్ద హీరోయిన్ లు అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలి. సక్సెస్ ఒకటే కాదు సక్సెస్ తో పాటు మంచి అదృష్టం కూడా ఉంటే సదరు హీరోయిన్ లు పెద్ద హీరోయిన్స్ గా మారుతారు. ఆ విధంగా ఒకటి రెండు సినిమాలతోనే టాప్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే పడుల సంఖ్యలో సినిమాలు చేసినా కూడా టాప్ హీరోయిన్స్ అవ్వని వారు ఉన్నారు. ఆ విధంగా కీర్తి సురేష్ మరియు రాశీ ఖన్నా లు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా కూడా టాప్ హీరోయిన్ల జాబితాలో చేరకపోవడం వారి అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. అంతకుముందు ఆమె చేసిన కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా భారీ స్థాయిలో అందుకోవడం వల్ల ఈమె పెద్ద హీరోయిన్ కాలేకపోయింది. అంతకుముందు పెద్ద హీరోల సరసన నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. మంచి మంచి అవకాశాలను సంపాదించుకుంది. అలా వచ్చిన క్రేజ్ తోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో భారీగా ఫ్లాప్ అయ్యాయి.  మరి సర్కారు వారి పాట సినిమా తర్వాత ఆమె వరుసగా పెద్ద సినిమాల్లో నటించి అగ్రహీరోయిన్ గా మారుతుంది అనేది చూడాలి. 

ఇటు రాశి కన్నా కూడా సినిమా పరిశ్రమలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఆమెకు ఎందుకో పెద్ద హీరోల సరసన నటించే అవకాశం పెద్దగా రావడం లేదు. యువ హీరోలతో ఆమె సినిమాలు చేస్తూ తన కెరీర్ను నెట్టుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఏమి అభిమానులు అన్నిరకాల అర్హతలు ఉన్నా కూడా ఈమె ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వకపోవడం పట్ల కొంత నిరాశను చూపిస్తున్నారు తొందర్లోనే ఈమె ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆమె పెద్ద హీరోయిన్ అయ్యే విధంగా జరుగుతుందా అనేది చూడాలి. అంతే కాదు చాలా మంది హీరోయిన్లు సైతం మంచి సినిమాలు చేస్తున్న కూడా పెద్ద హీరోలు లేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: