యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం..రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తిచేశాడు ప్రభాస్.అంతేకాదు  కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ డైరెక్షన్‏లో సలార్ మూవీ చేస్తున్నాడు.  వీటితో పాటుగా స్పిరిట్, ప్రాజెక్ట్ కే చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా.. ఇటీవల ఆదిపురుష్  చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.  కళ్ళ ముందు నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో.. మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుసు.

కాగా తాజాగా ఆదిపురుష్ స్టోరీ అది కాదంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ ఓంరౌత్. అయితే అందరూ అనుకున్నట్టుగా ఈ మూవీ స్టోరీ ఉండదని…ఇక ఇందులో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ పోషించే పాత్రలు అవి కాదంటూ కుండబద్దలు కొట్టాడు.మొత్తానికి ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ రాముడు కాదట. కాగా ఈ విషయాన్ని డైరెక్టర్‌ ఓం రవుత్ స్వయంగా వెల్లడించారు. అయితే  ఈ మెగా మైథలాజికల్ వండర్‌ గురించి రీసెంట్‌గా నేషనల్ మీడియాతో మాట్లాడిన ఓం.. ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఇక రామాయణగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు రాముడు కాదని…అంతేకాదు  ఆయన రాఘవ్‌ అనే పాత్రలో కనిపిస్తారన్నారు.దీంతోపాటు కృతిసనన్‌ పాత్ర పేరు కూడా సీత కాదని… జానకీ అని, సైఫ్ అలీఖాన్ పేరు లంకేష్ అని చెప్పడం జరిగింది.

అంతేకాకుండా డివైన్‌ నేమ్స్‌కు బదులుగా వేరే పేర్లు పిక్ చేయటం వెనుక రీజనెంటో కూడా క్లారిటీ ఇచ్చారు ఓం.అయితే ప్రభాస్ క్యారెక్టర్‌ రాముడు అనగానే ఓ డివైన్‌ ఫీలింగ్ వచ్చేస్తోంది.అంతేకాదు ఆడియన్స్‌ ఆ పాత్రను దేవుడిగానే చూస్తారు.ఎప్పుడు అలా కాకుండా ఓ గొప్ప పాత్రగా చూడాలనే ఉద్దేశంతోనే రాముడు అన్న పేరుకు బదులు సినిమాలో రాఘవ్ అనే పేరును వాడామని చెప్పారు.అయితే తాజా సమాచారం ప్రకారం 2000లో ముంబై ఫిలిం ఫెస్టివల్‌లో చూసిన ఓ యానిమేషన్ సినిమానే రామాయణం తెరకెక్కించాలన్న ఆలోచనకు మూలం అన్నారు. అంతేకాదు దీంతోపాటు ఒక ఫారినర్ రామాయణ కథను అంత గొప్పగా ఈ జనరేషన్‌కు చెపితే మనం ఏం చేస్తున్నా అన్న ఆత్మ విమర్శ నుంచే ఆదిపురుష్ ఆలోచన వచ్చిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: