అప్పట్లో సీనియర్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా చేసేవారు. తరువాత తరం హీరోలు వారి ఇమేజ్‌ని పెచుకోవడం కోసం మల్టీ స్టార్ సినిమాలను తగ్గించి వ్యక్తిగత హీరోలుగా రాణిస్తున్నారు. మళ్లీ నేటితరం హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా చాలా సంవత్సరాల తరువాత మల్టీస్టారర్ మూవీగా వచ్చిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెద్దోడు, చిన్నోడుగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించారు. ఇక ఈ మూవీని 2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజై, వరల్డ్ వైడ్ 54.75 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. అంతేకాక.. ఈ మూవీకి ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకుంది.

అంతేకాదు.. ఈ సినిమాకి ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకి, ఉత్తమ సహాయ నటుడుగా ప్రకాష్ రాజ్‌కి, ప్రత్యేక జ్యూరీ అవార్డుగా అంజలి నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక మాటల రచయిత గణేష్ పాత్రకి ఇది ఆఖరి సినిమా. ఈ సినిమాలో కొన్ని కీలక అంశాలు ఇప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే మొదట్లో ఈ చిత్రంలో గీత పాత్రకు సమంతని ఎంచుకున్నారట.

అయితే మొదటగా సీత పాత్రకోసం త్రిష, స్నేహా, భూమిక, అనుష్కలను అనుకున్నా, చివరకు అమలపాల్ ఒకే చెప్పాక ఆమె చివరి క్షణంలో తప్పుకుంది. దీంతో ఈ పాత్ర చివరికి అంజలి ఒకే చెప్పారు. అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా చేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ అనుకుంటే, చివరకు పవన్ ప్లేస్‌లోకి వెంకీ ఒకే చెప్పారంట. అలాగే ఈ సినిమాలో రేలంగి మావయ్య పాత్రకి హీరో రాజశేఖర్‌ని అనుకుంటే, తర్వాత ప్రకాష్ రాజ్‌ను ఎంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: