పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఒకసారి గమనిస్తే ఆయన సినిమాలోని 70 శాతం సినిమాలు కూడా రీమేక్ సినిమాలే ఉన్నాయి. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరొక భాషలోకి అనువదించడం అక్కడి నటీనటులతో తెరకెక్కించడం తప్పేమీ కాదు అయితే ఆ సినిమాను అక్కడి భాష ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా వారి ఆలోచనలకు తగ్గట్టుగా సినిమా చేసి దాని ద్వారా విజయం అందుకోవడమే అసలు సవాలు. అంతేకాదు ఈ సినిమా చేయడం వల్ల ఒత్తిడి కూడా ఉంటుంది.

ఎందుకంటే ఒరిజినల్ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆలచించాల్సి ఉంటుంది. అలా గత పది సినిమాలలో 5కి పైగా సినిమాలను పవన్ రీమేక్ సినిమాలు చేయగా ఇప్పుడు ఆయన రీ ఎంట్రీ లో కూడా వరుసగా రెండవ రీమేక్ చిత్రాన్ని విడుదల చేస్తూ ఉండడం విశేషం. వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కిన పింక్ సినిమా కి రీమేక్ కాగా ఇప్పుడు రేపు విడుదల చేస్తున్న సినిమా భీమ్లా నాయక్ కూడా రీమేక్ సినిమానే కావడం విశేషం. ఆ విధంగా ఇప్పటిదాకా రీమేక్ సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా డైరెక్ట్ తెలుగు సినిమానే. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్డైరెక్టర్ తో సినిమా చేస్తుండగా ఈ కొత్త రకమైన పాత్రలో ఆయన ఏ విధంగా కనిపించబోతున్నాడు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనీ సినిమా కూడా డైరెక్ట్ కథ ఉన్న సినిమా అని తెలుస్తుంది. ఇక చారిత్రాత్మక సినిమాగా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్న సినిమా హరిహర మందు కూడా క్రిష్ సొంత చేతులతోనే రచించిన కథ. ఈ విధంగా పవన్ ని డైరెక్ట సినిమాలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: