మళయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన మూవీ అయ్యప్పనుం కోషియం. ఈ సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ అని రీమేక్ చేశారు. త్రివిక్రం మాటలు, కథనం అందించగా సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ భీమ్లా నాయక్ మూవీ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రాజకీయనాయకుని తనయుడైన డేనియర్ శేఖర్ (రానా) తన పొగరుతో పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) తో ఢీ కొడతాడు. ఈగో వర్సెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ క్లాష్ అవడంతో భీమ్లా నాయక్  సినిమా కథ నడుస్తుంది.

విశ్లేషణ :

ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి మనిషి ప్రాధమిక భావోధ్వేగాలు.. వీటి మధ్య అల్లుకున్న కథే భీమ్లా నాయక్. ఇద్దరు మనుషుల మధ్య అహంకారం, స్వీయ గౌరవం మధ్య జరిగే సంఘర్షణ భీమ్లా నాయక్ సినిమా. రా ఎమోషన్స్ తో సినిమాని నడిపించాడు దర్శకుడు సాగర్ చంద్ర.

నటీనటులు, సాంకేతిక వర్గం :

రానా ఈ సినిమాలో నిమైన హీరో అని చెప్పొచ్చు. డానియల్ శేఖర్ క్యారక్టర్ లో రానా పవన్ కళ్యాణ్ ని కూడా డామినేట్ చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్, రానా పోటీ పడి మరి నటించారు. ఇక నిత్యా మీనన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంద్ది. సుగుణ పాత్రలో నిత్యా మీనన్ అదరగొట్టింది. మురళి శర్మ కూడా తన పాత్రలో మెప్పించాడు. రఘు, సముద్ర వారికి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సంయుక్త మీనన్ నటన ఆకట్టుకుంది.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ సినిమాకు మ్యూజిక్ అదిరిపోయింది. థమన్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా థమన్ తన మార్క్ చూపించాడు. భీమ్లా నాయక్ బిజిఎం సినిమా హైలెట్ లలో ఒకటని చెప్పొచ్చు. ఆర్ట్ డైరక్టర్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సినిమా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది.

డైరక్షన్ :

డైరక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వ ప్రతిభ చాటాడు. ఈ విషయంలో తనని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఒక సినిమా రీమేక్ చేయడం చాలా కష్టం. సూపర్ హిట్ సినిమా రీమేక్ అంటే ప్రెజర్ ఉంటుంది. పవన్, రానా లాంటి స్టార్స్ ఉండగా ఆ ప్రెజర్ ఇంకాస్త పెరుగుతుంది. కానీ సాగర్ చంద్ర ఈ విషయంలో బాగా హ్యాండిల్ చేశారు. పవన్, రానాల మధ్య అన్ని సీన్స్ చాలా బాగా వచ్చాయి. కథకు అనుగుణంగా ఇద్దరి మధ్య సీన్స్ అదిరిపోయాయి. అయితే కొన్ని సన్నివేషాలు కాస్స్త ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. అయితే ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే సీన్స్ మాత్రం బాగా చేశారు. డైరక్టర్ గా సాగర్ చంద్రకి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు.

లిమిటేషన్స్ :

క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా చేసి ఉంటే బాగుండేది.. కలిమాక్స్ చాలా డ్రమెటిక్ గా అనిపిస్తుంది. నిత్యామీనన్ పాత్రకి ఇంకాస్త స్కోప్ ఇచ్చి ఉండాల్సింది అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లొ మేకప్ ఇంకాస్త బాగా కుదరాల్సింది. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా సినిమా ఫ్లో మిస్ అయ్యేలా చేస్తుంది.

బాటం లైన్ : పవర్ ఫుల్ హ్యూమన్ డ్రామా.

రేటింగ్ : 3.5/5

మరింత సమాచారం తెలుసుకోండి: