కీర్తి సురేష్ కు ఓ వైపు వరుస ఫ్లాప్ లు వస్తున్న కూడా ఎందుకో పెద్ద సినిమా అవకాశాలు ఆమెకు వస్తున్నాయి అని చెప్పొచ్చు. నేను శైలజ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె ఆ చిత్రంతో మంచి విజయం తో పాటు మంచి గుర్తింపు దక్కించుకుంది అని చెప్పొచ్చు. ఆ సినిమాలో ఆమె చేసిన సెటిల్డ్ పాత్ర కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా ఆడియెన్స్ లో ఆమెకు పెరిగిన డిమాండ్ ను చూసి మేకర్స్ ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలా మహానటి సినిమా తో ఆమె దేశం మొత్తం గర్వించదగ్గ నటి అనిపించుకున్నారు.

అయితే మొదటినుంచి కీర్తి సురేష్ చేసే తప్పు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. మిగితా హీరోయిన్ లు తమ కెరీర్ ఎండింగ్ దశలో ఈ రకమైన సినిమాలు చేస్తుంటే స్టార్ హీరోయిన్ అయ్యే దశలోనే ఈ సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలు ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టాయా అంటే అది కూడా కాదు. ఆ సినిమాలు ఆమెకు భారీ ఫ్లాప్ లు తెచ్చిపెట్టాయి. దాంతో ఆమెకు పాపులారిటీ కూడా చాలా తగ్గింది అని చెప్పొచ్చు.  ఏదైనా కీర్తి సురేష్ అదృష్టం బాగానే ఉంది అని చెప్పొచ్చు. అందుకే ఆమె కు అన్ని ఫ్లాప్ లు వస్తున్న అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె మహేష్ బాబు సరసన సరిలేరునేకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఆమె భారీ ఆశలే పెట్టుకుంది. సక్సెస్ సాధించి చాలారోజులు అయిపోయిన నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు ఈ సినిమా తో విజయం సాధించి ఫామ్లోకి రావాలని చూస్తుంది. దానికి తగ్గట్లే ఆమెకు వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే అనౌన్స్ కాబోయే పెద్ద హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశం వస్తుందట. మరి కీర్తి సురేష్ ఆ సినిమాలతో పూర్వవైభవం దాక్కుంచుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: