పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ హీరోగా మారిపోయాడా అంటే ఇండస్ట్రీ వర్గాల్లో చాలామంది అభిప్రాయం అలానే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా దాదాపుగా రీమేక్ సినిమానే కావడం గమనార్హం. ఆయన హీరోగా చేసిన తొలి సినిమా కూడా రీమేకే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా బాలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందిన చిత్రం.ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఇక్కడ విడుదల చేశారు.

ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన గోకులంలో సీత సినిమా కూడా రీమేక్ సినిమానే. అలా ఇప్పటివరకు 70% సినిమాలు పవన్ చేసినవి రీమేక్ సినిమాలే. ఆయన కెరీర్ లో సూపర్ హిట్టయిన బద్రి సినిమా మాత్రమే ఒరిజినల్ స్టోరీ ఉన్న సినిమా. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చిన విజయంతో ఉత్సాహంగా ఇంతగా ఈ సినిమా కూడా బాలీవుడ్లో హిట్టయిన దబాంగ్ సినిమాకిది రీమేక్ చేశారు అలా పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం కూడా ఏదో ఒక భాషలో వచ్చిన సినిమానే ఇక్కడ రీమేక్ గా చేశారు.  

ప్రస్తుతం కూడా ఆయన వరుస రీమేక్ సినిమాల్లో చేస్తున్నారు. రాజకీయాల నుంచి కొంత బ్రేక్ తీసుకొని టాలీవుడ్ లో సినిమాల మీద సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ వస్తూ వస్తూనే వకీల్ సాబ్ అనే సినిమాను చేశాడు. అది బాలీవుడ్లో తెరకెక్కిన పింక్ సినిమాకు రీమేక్. ఆ తర్వాత ఆయన చేసిన సినిమా భీమ్లా నాయక్ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రం కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమానే. మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన అత్యధికంగా రీమేక్ సినిమాలు చేయడంతో ఆయన రీమేక్ స్టార్ గా మారిపోయాడు అంటూ కొంతమంది చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు కూడా ఒక తమిళ రీమేక్ చేయడానికి త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: