ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సినీ పరిశ్రమ పేరు బాగా వినబడుతుంది,  దాని దానికి ప్రధాన కారణం ఒక వైపు సినీ పరిశ్రమకు ఉన్న సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అనుకూలంగా స్పందిస్తూ ఉంటే,  మరో పక్క టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడం ఇలా కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ పేరు  రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వినపడుతోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన  జగన్ తో సమావేశమై సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో వివరించినట్లు ఆ సమస్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సినీ పరిశ్రమ పెద్దలు తెలియజేశారు.

ఇలా ఏదో ఒక విషయమై సినీ పరిశ్రమ పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వినబడుతూనే ఉంది,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి అయిన కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు, ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి కూడా సినీ పరిశ్రమకి తాము పూర్తి సపోర్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు.  సదా నన్ను నడిపే అనే మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ... చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ చాలా అనుకూలంగా ఉంది, మా ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు పూర్తిగా అండగా ఉంది అని మహమ్మద్ అలీ తెలియజేశాడు. వచ్చే ఐదు సంవత్సరాలలో చిత్ర నిర్మాణంలో హైదరాబాద్ దేశానికి మరో ముంబయి ల మారుతుంది అని మహమ్మద్ అలీ తెలియజేశాడు,  సినిమా పరిశ్రమకు సీఎం కేసీఆర్‌ పూర్తి సహకారం అందిస్తున్నారు అని ఈ టీజర్ విడుదల సందర్భంగా మహమ్మద్ అలీ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: