సినీ సెలబ్రిటీల కు సంబంధించిన ఏ విషయం అయినా సరే బయటికి వచ్చింది అంటే అది అటు మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినంత కిక్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారం బయటకి వస్తే అది క్షణాల్లో వ్యవధిలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా హీరో ప్రేమలో ఉన్నాడు ఈ హీరోయిన్ ప్రేమ లో ఉంది అంటూ ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ మారిపోతు ఉంటుంది.


 ఇక ఇప్పుడు హీరో సందీప్ కిషన్ కు సంబంధించి ఇలాంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రేమలో పడిపోయాడా అంటే సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతున్న వార్త మాత్రం అవును అని చెబుతోంది  ఇక ఈ వార్త నేపథ్యంలో సందీప్ కిషన్ ప్రేమలో ఉన్న అమ్మాయి ఎవరు అని తెలుసుకోవడానికి నెటిజన్లు అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ అమ్మాయి ఎవరో కాదు బాలీవుడ్ నటి సోనియా రతి. మాధవన్ తో కలిసి డి కపుల్ సినిమాతో నటించి ప్రేక్షకులను అలరించింది.


 అయితే సోనియా  కేవలం నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. అంతేకాకుండా ప్రొడక్షన్ డిజైనర్ గా కూడా పనిచేస్తుంది. అయితే సందీప్ కిషన్ ఎక్కువగా ముంబై వెళుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల సోనియా  సందీప్ కిషన్ తో దిగిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోలు కాస్త వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న దానికి మరింత బలాన్నిస్తున్నాయి. ఇక ముంబైని తన రెండవ ఇల్లు గా భావించే సందీప్ కిషన్ హీరోయిన్ సోనియా రతితో ప్రేమ లో ఉన్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొట్టడం మొదలు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: