టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్న హీరోలు అనేక మంది ఉన్నారు,  అయితే ఇలా రీమేక్ సినిమాలు చేసి ఎక్కువ విజయాలు అందుకున్న టాలీవుడ్ హీరో లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కూడా ఒకరు.  ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చాలా రీమేక్ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు,  ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వాఖిల్ సాబ్ సినిమా కూడా బాలీవుడ్ సినిమా పింక్ కి రీమేక్ గా తెరకెక్కింది,  ఇది మాత్రమే కాకుండా తాజాగా విడుదలై ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతు,  విడుదల అయిన మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్ లను సాధించిన  భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళం మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినాదే.

 ఇలా రీమేక్ సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ చిత్తం సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో  ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఈ సినిమాను తమిళ్ లో సముద్ర ఖని దర్శకత్వం వహించాడు,  తెలుగు లో కూడా సముద్ర ఖని దర్శకత్వం లోనే పవన్ కళ్యాణ్ నటించినున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా కథ లో మార్పులు, చేర్పుల విషయం లో   పవన్ కళ్యాణ్,  త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర లో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి,  ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: