పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమిక్ సినిమాల మీద ఆ రేంజ్ ఇంట్రెస్ట్ చూపిస్తాడో మనందరికీ తెలిసిందే,  ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎన్నో రీమేక్ సినిమాలో నటించాడు,  అలాగే పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాల్లో ఎన్నో సినిమాలు మంచి విజయాలను కూడా సాధించాయి,  ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పోయిన సంవత్సరం హీరోగా నటించిన సినిమా వఖిల్ సబ్ హిందీ సినిమా పింక్ కి రీమేక్ గా తెరకెక్కింది,  అలాగే  పవన్ కళ్యాణ్ హీరో గా నటించి తాజాగా ఫిబ్రవరి 25 వ తేదీ న థియేటర్ లలో విడుదలైన భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

ఇలా వరుస పెట్టి రీమేక్ సినిమాలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ సినిమా వినోద సిత్తం  ను  కూడా రీమేక్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరో సినిమాను  రీమేక్ చేయబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.  విక్రమ్ వేద సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే,  కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ ప్రకటన వెలువడలేదు.  ఇది ఇలా  ఉంటే తాజాగా  మరోసారి ఈ సినిమాకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి,  పవన్ కళ్యాణ్,  రవితేజ కలిసి విక్రమ్ వేద చేయబోతోన్నారంటూ ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.  పోలీస్ ఆఫీసర్ పాత్ర అయిన మాధవన్ పాత్రలో పవన్ కళ్యాణ్, రౌడీగా  విజయ్ సేతుపతి నటించిన పాత్ర లో రవితేజ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి,  ఇది ఇలా  ఉంటే ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: