కొంత కాలం పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పరాజయాలను ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదలైన క్రాక్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు,  అయితే అలా క్రాక్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్నాడు.  అందులో భాగంగా రవితేజ నటించిన ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన తెలుగు తో పాటు హిందీలో కూడా విడుదల అయ్యింది,  ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే ప్రేక్షకుల నుండి మిక్సీడ్ టాక్ ను సంపాదించుకుంది, చివరగా ఈ సినిమా  బయ్యర్ లకు నష్టాలనే మిగిల్చినట్లు సమాచారం. ఇలా క్రాక్ సినిమా తర్వాత మరో అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల పై ఫోకస్ పెట్టాడు, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు , రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించిన టీజర్ ను కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో  రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ ,  రజీషా విజయన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ మూవీ కి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే రామారావు ఆన్ డ్యూటీ సినిమా లోని పాటలను చిత్రీకరించడం కోసం ఈ చిత్ర బృందం స్పెయిన్ ను సెలెక్ట్ చేసుకుంది, స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో సాంగ్స్ ని చిత్రీకరించడానికి టీమ్ వెళ్లింది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు,  రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో  వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: