రెబల్ స్టార్ కృష్ణంరాజు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఒకప్పుడు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఇక ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక నేటి తరం ప్రేక్షకులకు మాత్రం కృష్ణంరాజు అనగానే ప్రభాస్ పెదనాన్న అని గుర్తుకు వస్తూ ఉంటుంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు అన్న విషయం తెలిసిందే.


 ఇంట్లో కాలుజారి పడిపోవడంతో ఆయన తుంటికి గాయం అయ్యింది. ఈ క్రమంలోనే వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకొని కోలుకున్నారు కృష్ణంరాజు. ఇకపోతే మరోసారి కృష్ణంరాజు ఇంట్లో కాలుజారి పడ్డారు అనేది తెలుస్తుంది.దీంతో ఇక ఆయన కాలి వేలికి గాయం అయ్యిందట. అంతేకాదు కృష్ణంరాజుకు ఆపరేషన్ అయింది అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సర్జరీ లో భాగంగా ఆయన కాలివేలిను తొలగించాల్సి వచ్చిందట. దీనికి సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరు కూడా కంగారు పడిపోతున్నారు.



 ఇక ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యం నిలకడగానే ఉంది అని తెలుస్తోంది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణంరాజు సతీమణి  శ్యామల ఆయన ఇంట్లో జారి పడ్డారు అంటూ చెప్పారు. కానీ ఆపరేషన్ జరిగిన విషయం మాత్రం చెప్పలేదు. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే   ప్రభాస్ కోసం తన కెరీర్ లోనే మొదటిసారి జ్యోతిష్యుడి పాత్రలో కనిపించబోతున్నాడు కృష్ణంరాజు. ఈ సినిమాకి అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: