జాత‌కాల జావ‌ళి ఈ లోకం
అనేందుకు వినేందుకు బాగుంటుంది
జాత‌కాలు హ‌స్త సాముద్రిక ప‌ద్ధ‌తులు
అక్ష‌రాల్లో కూర్పులు బాగుంటాయి
కానీ.. క‌థ నుంచి వాస్త‌వం వ‌ర‌కూ
ఏమ‌యినా క‌ల్ప‌న ఒక‌టి జోడింపు చేస్తేనే
సినిమా హిట్.. ఆ త‌ర‌హా క‌ల‌ప‌డంతోనే సినిమా హిట్
ఆ విధంగా రాధే శ్యామ్ హిట్...


చాలా రోజుల నుంచి ఏపీ స‌ర్కారు నుంచి కోరుకుంటున్న టికెట్ ధ‌ర‌ల పెంపు అన్న‌ది ఓ స్ప‌ష్ట‌మ‌యిన నిర్ణ‌యంకు రావ‌డంతో,ఇందుకు సంబంధించిన జీఓ కూడా విడుద‌ల కావ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఈ రాత్రి (గురువారం రాత్రి) నిద్ర పోయేలా లేరు. మా ఊళ్లో మా శ్రీ‌కాకుళంలో థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఒక్కటే సంద‌డి.అయినా నేను సినిమాను చూశాను. సినిమా బాగుంది.బాగుంటుంది కూడా!


వ‌ర్షం సినిమా చూసిన ఆనందంలో ఎన్నో రోజులు ఉన్నాను నేను.అస‌లీ డైరెక్ట‌ర్ శోభ‌న్ ఏమ‌యినాడో! అని కూడా వెతికాను. త‌రువాత కాలంలో ఆయ‌న చ‌నిపోయారు. ఇది కూడా విధి! ఇక రాధా కృష్ణ అనే కుర్ర డైరెక్ట‌ర్ కు బేసిక్ థాట్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఇచ్చారు.. ఆ లైన్ తో క‌థ రాసుకుని ఇట‌లీ నేప‌థ్యంలో తీసిన సినిమా ఇది.విధి కి ప్రేమ‌కు మ‌ధ్య అంతః సంఘ‌ర్ష‌ణ మ‌రియు సంవాదం.



హ‌స్త సాముద్రిక నిపుణుడిగా క‌నిపించే ప్ర‌భాస్ .. పొడుగు కాళ్ల పిల్ల పూజా హెగ్డేను వ‌రించ‌డం. ప్రేమాయ‌ణం న‌డ‌ప‌డం త‌న క‌థేంటో త‌న‌కే తెలియ‌క‌పోవ‌డం భ‌విష్య‌త్ ను అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డం వంటి ట్విస్టులు కొన్ని ఉంటాయ‌ని తెలుస్తోంది.ఈ క‌థ ఇలా ఉన్నా లేక‌పోయినా ఈ సినిమా మాత్రం దాదాపు ఇలానే ఉంటుంది.ఈ నేప‌థ్యంలో ఇదే సంద‌ర్భంలో ప్రివ్యూ చూసి సినిమా నిడివిని త‌గ్గించాడు రాజ‌మౌళి క‌నుక ఆ విధంగా మ‌నం అన‌గా ప్రేక్ష‌కులం సేఫ్. కుర్ర డైరెక్ట‌ర్ ఏం చేశాడు అన్న‌ది తెర‌పై చూడండి. మ‌రో కుర్రాడు యువన్ పాడిన పాట ఎవ‌రో నీవెవ‌రో పాడిన పాట వినండి. మ‌రో కుర్ర స్వ‌ర త‌రంగం కాదు కాదు ధ్వ‌ని త‌రంగం థ‌మన్ నేప‌థ్య సంగీతం కూడా అద‌న‌పు బ‌లం అయితే కావొచ్చు. తెలియ‌దు.. అవ్వాల‌ని కోరుకోండి.డియ‌ర్ ప్ర‌భాస్ ఆల్ ద బెస్ట్.



-  శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి: