సమంత చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తనని ఆపేవాళ్ళు లేరు..తన ఇష్టం వచ్చినట్లు సినిమాలు చెస్తుంది..తనకు డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటే ఆ పాత్రలు. ఆఖరికి ఐటమ్ సాంగ్స్ ను కూడా చెస్తుంది. ఇటీవల విడుదల అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా పుష్ప లో సామ్ ఐటమ్ సాంగ్ చేసింది. ఆ పాట ఎంత క్రేజ్ ను అందుకుందో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమా విడుదలకు ముందే ఈ పాటకు మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఎప్పుడూ కనిపించని విధంగా సామ్ కనిపించి అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చింది.



సామ్ సినిమాలు కూడా వరుసగా చేసుకుంటూ వస్తుంది.. మొత్తానికి గతంలో లాగా ఏడాదికి ఒకటో రెండో కాకుండా నాలుగు, ఐదు సినిమాలు చెస్తుంది. మరో వైపు ఫ్రెండ్స్ తో జాలీ ట్రిప్లు వేస్తూ ఎంజాయ్ చెస్తుంది. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫెమస్ అవుతుంది. అంతేకాదు..

క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్ కు సమంత ఎన్నికైంది. ఈ అవార్డును స్వీకరించేందుకు సమంత ముంబైలో ఉంది. అవార్డ్ ఫంక్షన్ కోసం ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు నైనికా డ్రెస్ ను ధరించి మరింత అందంగా కనిపించింది. ఈ ఫోటోను అలా పోస్ట్ చెసిందొ లేదో లెక్కలెనన్ని కామెంట్లు అందుకుంది. 



ఇది ఇలా ఉండగా..మొత్తం నాకు అంతా కలలా కనిపిస్తుంది అంటూ సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ డ్రెస్ ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది.. ఆ ఫోటోకి క్యాప్షన్ తో ట్యాగ్ చేసింది. నాకు అత్యంత ఇష్టమైన లుక్ లో ఇదొకటి అంటూ చెప్పుకొచ్చింది.. ఈ ఫోటోకి ఫ్యాన్స్ తో పాటు సినీతారలు రష్మిక, హన్సిక వంటి హీరోయిన్లు కూడా స్పందించారు. అందరి చేత బాగున్నావు అంటూ కామెంట్స్ అందుకుంది. ఇకపోతే నాగ చైతన్య మేనమామ హీరో వెంకటేష్ కుమార్తె దగ్గుబాటి అశ్రిత కూడా ఈ ఫోటో పై కామెంట్స్ చేశారు. సామ్ ను ఇలా చూస్తుంటే ముచ్చటగా వుంది..అంటూ ఒక లవ్ సింబల్ ను కూడా జత చేసింది. ప్రస్తుతం సామ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: