అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘రాథే శ్యామ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రభాస్ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో తరుచు విధి గురించి మాట్లాడాడు. అంతేకాదు ‘బాహుబలి’ విడుదల వరకు తాను కృషి ని నమ్ముతూ ఉండేవాడినని అయితే ‘బాహుబలి’ విడుదల తరువాత విధిని నమ్మడం మొదలుపెట్టాను అంటూ ప్రభాస్ అనేకసార్లు చెప్పడంతో ‘రాథే శ్యామ్’ పై ప్రభాస్ కు పూర్తి నమ్మకం లేదా అన్నసందేహాలు వ్యక్తం అయ్యాయి.


దృశ్యం తప్ప కావ్యం లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈకామెంట్స్ అన్నీ ప్రభాస్ అభిమానుల దృష్టివరకు వెళుతూ ఉండటంతో వచ్చేవారం నుండి ఈమూవీ కలక్షన్స్ పరిస్థితి ఏమిటి అంటూ వారిలో కలవరపాటు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘బాహుబలి’ తరువాత ‘సాహో’ ఇప్పుడు ‘రాథే శ్యామ్’ సినిమాలకు నెగిటివ్ ఫలితాలు రావడంతో కొంతవరకు ప్రభాస్ మార్కెట్ పై ఈ మూవీ ఫలితం ఉంటుంది అన్నప్రచారం కూడ జరుగుతోంది.


దీనితో ప్రభాస్ తాను ఎంచుకునే కథల విషయంలో పొరపాట్లు చేస్తున్నాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీలో ప్రభాస్ శ్రీరాముడు గా నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు శ్రీరాముడు అంటే నందమూరి తారకరామారావు మాత్రమే గుర్తుకు వస్తాడు. అలాంటి పవిత్రభావనతో కూడిన పాత్రలో ప్రభాస్ ను తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న సందేహాలు కూడ ఉన్నాయి.


ప్రభాస్ నుండి భారీ యాక్షన్ సీన్స్ తో కూడిన సినిమాలు మంచి కథలతో సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈవిషయాన్ని ప్రభాస్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అంటున్నారు. ‘బాహుబలి’ లో నటిస్తున్నప్పుడు సత్యరాజ్ తనతో మాట్లాడుతూ ఎంతగొప్ప వ్యక్తి అయినా విధిని తప్పించుకోలేడు అని తనతో అన్నప్పుడు తాను అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదని అయితే ఇప్పుడు తనకు విధి పై నమ్మకం కుదిరింది అంటూ ప్రభాస్ ఈమధ్య చాలాసార్లు అంటున్నాడు. దీనితో ‘రాథే శ్యామ్’ ఫలితం ముందుగానే ఊహించాడ అంటూ కొందరి కామెంట్స్..







మరింత సమాచారం తెలుసుకోండి: