తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక హిట్ సినిమా సాధించారంటే చాలు ఇక వారికి వరుసగా అవకాశాలు వెళ్ళువడుతూనే ఉంటాయి. అందుకోసమే ఎంతో మంది డైరెక్టర్లు సైతం ఒక్క ఛాన్స్ అని ఎదురు చూస్తూ ఉంటారు.. ఇక ఇలాంటి ఛాన్స్ కోసమే నటీనటులు కూడా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలోనే ఓవర్ నైట్ కే కొందరి జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ హిట్ కోసం చాలా తాపత్రయ పడుతున్నారు.. ఆయన గురించి తెలుసుకుందాం.



డైరెక్టర్ మరే ఎవరో కాదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారులోకం సినిమా ద్వారా మొదటిసారిగా దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మహేష్ - వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత మహేష్ తో బ్రహ్మోత్సవం తీసి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు. ఇక గత చివరి చిత్రం వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమా ని రీమిక్స్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా  క్రెడిట్ మొత్తం వెంకటేష్ కి  దక్కింది.


ఇక దీంతో మరొక భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక ఆ నిర్మాత ఎవరో కాదు అఖండ వంటి సినిమాని నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి తనయుడు నే హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు.అందుకు సంబంధించి కథలు కూడా చర్చనీయాంశంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఒక మల్టీస్టారర్ మూవీ మూవీ కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆ సినిమాకి టైటిల్ గా అన్నాయ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: