సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట చిత్రం రూపొందుతోన్న విషయం అందరికి తెలిసిందే. వినోదమే ప్రధానంగా బ్యాంకు స్కాం చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు అలాగే మరికొందరు ఫైటర్స్ తో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ విధంగా మహేష్ బాబు భారీ స్థాయి యాక్షన్ సీన్లతో కూడుకున్న సీన్స్ ఈ సినిమాలో చేయడం ఆయన అభిమానులను ఎంతగానో ఆనంద పరుస్తోంది.

మహేష్ బాబు మార్క్ కామెడీతో పాటు మంచి యాక్షన్ సీన్ లు ఎక్కువగా ఉన్న ఈ సినిమా దుబాయ్ గోవా స్పెయిన్ వంటి పలు అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా ఉన్నాయి అని అంటున్నారు. అలాగే రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్లు కూడా ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉండడం ఖాయమని చెబుతున్నారు సినిమా మేకర్స్. గతంలో ఎప్పుడూ మహేష్ ను చూడని విధంగా ఈ చిత్రంలో మనం చూడబోతున్నాం అని అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి తమన్ సంగీత బాణీలు అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కళావతి అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తమిళ హిందీ భాషలలో మే 12వ తేదీన విడుదల చేయనున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు ఏకే ఎంటర్ టైన్ మెంట్ వారు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరింపచేస్తుదో చూద్దాం. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ ఈ సినిమా తో అదే సక్సెస్ ను కంటిన్యూ చేద్దామని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: