తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజానికి తగ్గట్టుగా వారి సినిమాలను తెరకెక్కిస్తు ఇతర భాషల లో ఉండే హీరోలను సైతం మన దర్శకులు బాగా ఆకర్షిస్తున్నారు. ఇక విరితో కొన్ని సినిమాలు చేయడానికి ఇతర భాషల హీరోలు సైతం తెగ పోటీపడుతున్నారు. అయితే మరి కొందరు హీరోలు మాత్రం ఏకంగా తెలుగు దర్శకులతో నే డైరెక్ట్ గా సినిమాలు తీయాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.


విభిన్న మైన దర్శక తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది ఉన్నారు డైరెక్టర్ వంశీ. తెలుగు సినిమాలకు రచయితగా కూడా ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా తమిళ హీరో విజయ్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా తీయడానికి చాలా ఆతృతతో ఉన్నట్లుగా సమాచారం. ఇక మరొక హీరో ధనుష్.. డైరెక్టర్ వెంకీ అట్లూరి తో డైరెక్ట్ గా ఒక సినిమాని తెలుగులో చేయబోతున్నారని వార్త వినిపిస్తోంది. ఇక మరొక హీరో శివ కార్తికేయన్.. ఈయన తెలుగులో డైరెక్టర్ అనుదీప్ తో కలిసి హీరో కూడా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు అనే వార్త బాగా వినిపిస్తోంది. ఇక వీరే కాకుండా ఇతర హీరోలు సైతం డైరెక్టుగా తెలుగు దర్శకులతో నేను కొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్త తమిళ మీడియా వర్గాల నుంచి వినిపిస్తోంది.


ఇప్పటివరకు బాహుబలి, పుష్ప, జెర్సీ, మహర్షి, సాహో, శ్యామ్ సింగరాయ్ మరికొన్ని సినిమాలు విభిన్నమైన కథలతో సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులను సెలబ్రిటీలు సైతం బాగా ఆకట్టుకున్నాయి.. దీంతో ఈ సినిమాను కొంతమంది హీరోలు తెరకెక్కించడానికి చాలా ఆతృతగా. అంతేకాకుండా ఇంత టాలెంట్ కలిగిన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇతర భాషలలోని హీరోలు కూడా ఛాన్స్ వస్తే వదులుకోము అని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా మన తెలుగు దర్శకులు సరికొత్త కథల తో దూసుకుపోతున్నారని  చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: