పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమిక్ సినిమాల మీద ఎ రేంజ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడో మన అందరికీ తెలిసిన విషయమే,  ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో రీమేక్ సినిమాలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు,  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు,  అయితే తిరిగి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హిందీ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాను తెలుగులో  వకిల్ సబ్ టైటిల్ తో రీమేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.

 ఆ తర్వాత మలయాళంలో సూపర్ హిట్ విజయం సాధించిన అయ్యప్పనున్ కొషియన్ సినిమాను తెలుగు లో భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేసి విడుదల చేశాడు, ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది, ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరో రీమేక్ మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా వినోద‌యం సితం ను తెలుగు లో పవన్ కళ్యాణ్ రీమిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది,  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం, ఇది ఇలా ఉంటే ఈ రీమేక్ మూవీ ని త్రివిక్ర‌మ్‌, జీ స్టూడియోస్‌, పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి నిర్మించనున్నట్లు సమాచారం.  పవన్ కళ్యాణ్మూవీ షూటింగ్ లో 25 రోజులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది, ఈ రీమేక్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ రూ.60 కోట్ల పారితోష‌కంతో పాటు లాభాల్లో వాటాను కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: