రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో డైరక్షన్ లో తెరకెక్కిన మూవీ స్టాండ్ అప్ రాహుల్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తన స్టాండప్ కామెడీతో అందరిని అలరించాలనే ఆశ ఉన్న రాహుల్. పేరెంట్స్ మధ్య గొడవలవడంతో తండ్రి నుండి అతన్ని దూరం గా తీసుకుని వెళ్తుంది రాహుల్ మదర్ ఇందుమతి (ఇంద్రజ). తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రేమ, పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేని రాహుల్ తన వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లాక అక్కడ తన చిన్ననాటి స్నేహితురాలు శ్రేయ (వర్ష బొల్లమ్మ) తిరిగి టచ్ లోకి వస్తుంది. రాహుల్ అంటే ఇష్టం ఉన్న శ్రేయ అతనితో సహజీవనం చేసేందుకు రెడీ అవుతుంది. ఇంతకీ రాహుల్ తన కలని నెరవేర్చుకున్నాడా..? తన ప్రేమని గుర్తించాడా..? అనుకున్న విధంగా సక్సెస్ అయ్యాడా లేదా అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

స్టాడప్ కామెడీ చేసేవాళ్లందరికి లోపల ఏదో తెలియని బాధ ఉంటుంది అన్న కాన్సెప్ట్ మరోసారి చూపించాడు డైరక్టర్ శాంటో. అలాంటి వాళ్లే స్టాండప్ కామెడీ చేస్తారా మిగతా వాళ్లు చేయరా అన్న డౌట్ ఆడియెన్స్ కి రాక మానదు. ఇక సినిమాలో ఎమోషన్స్ బాగున్నా ఆడియెన్స్ కి కనెక్ట్ అవడంలో విఫలమైంది. ఫస్ట్ హాఫ్ అంతా పర్వాలేదు అనిపించగా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది.

హీరో, హీరోయిన్స్ పాత్రల మధ్య కన్ ఫ్యూజన్ కూడా ఆడియెన్స్ కి క్లారిటీ అనిపించదు. డైరక్టర్ కథ మీద ఇంకాస్త బాగా వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది. ఓ మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమాగా మలచే అవకాశం ఉన్న కథని రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో లాగిచ్చేశాడు.

సహజీవనంలో వచ్చే సమస్యల మీద డైరక్టర్ బాగానే రీసెర్చ్ చేసినా అవి ఎందుకో ఆడియెన్స్ కి రీచ్ అవలేకపోయాయి. సినిమా డైరక్టర్ కథనం విషయంలో ట్రాక్ తప్పాడని చెప్పొచ్చు. మురళి శర్మ లాంటి మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ ని తీసుకుని ఆయన్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. ఫైనల్ గా ఒకసారి చూసే జస్ట్ టైం పాస్ మూవీగా స్టాండప్ రాహుల్ ఉంది.

నటీనటుల ప్రతిభ :

రాజ్ తరుణ్ ఎప్పటిలానే తన జోవియల్ నటనతో ఆకట్టుకున్నాడు. అయితే క్యారక్టర్ పరంగా ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేది. మేకోవర్ పర్వాలేదు అనిపిస్తుంది. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ లో బాగానే చేశాడు. వర్ష బొల్లమ్మ పాత్ర ఆకట్టుకుంటుంది. సినిమాలో ఇంద్రజ పాత్ర ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెప్పిస్తుంది. మురళి శర్మ పాత్ర అసంతృప్తిగా ఉంది. వెన్నెల కిశోర్ ఉన్నంతసేపు కామెడీ బాగానే అనిపిస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం :

శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ అలరించింది. స్వీకర్ అగస్తీ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. డైరక్టర్ కథ, కథనం లో తన ప్రతిభ కనబరచలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ మాములుగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

రాజ్ తరుణ్

వర్ష

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

వీక్ క్యారక్టరైజేషన్

రొటీన్ కామెడీ

బాటం లైన్ :

స్టాండప్ రాహుల్.. మరోసారి నిరాశపరచిన రాజ్ తరుణ్..!

రేటింగ్ : 2/5

మరింత సమాచారం తెలుసుకోండి: