టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ముకుంద సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు,  ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ వరుణ్ తేజ నటన తో మాత్రం ప్రేక్షకులను అలరించాడు.  ఆ తరువాత వరుణ్ తేజ్ నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా కొనసాగుతున్నాడు,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుణ్ తేజ్, కిరణ్  కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన గని సినిమాలో హీరో గా నటించాడు.  ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్,  వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా ను దర్శకుడు కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కించాడు.  

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరి పోయే రెస్పాన్స్ లభించింది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి తాజాగా చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.  తాజా గా చిత్ర బృందం విడుదల చేసిన గని సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరి పోయే రెస్పాన్స్ లభిస్తోంది,  చాలా వేగంగా గని సినిమా ట్రైలర్ 6 మిలియన్ ల వ్యూస్ ను యూట్యూబ్ లో సాధించింది.  తమన్ సంగీతం ఈ సినిమా ఏప్రిల్ ఎనిమిదవ తేదీన విడుదల కాబోతుంది,  గని మూవీ లో వరుణ్ తేజ్ తల్లిదండ్రులుగా జగపతిబాబు ,  నదియా నటించ గా, ముఖ్యమైన పాత్రల్లో సునీల్ శెట్టి ,  ఉపేంద్ర ,  నవీన్ చంద్ర నటించారు. గని మూవీ ని అల్లు బాబీ , సిద్ధు ముద్ద నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: