అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ సినిమాలో ఎక్కువ శాతం గుర్తింపు విజయ్ దేవరకొండ కే దక్కింది,  టాక్సీవాలా పెద్ద  విజయం సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది అని చెప్పవచ్చు.  టాక్సీ వాలా సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎస్ ఆర్ కళ్యాణమండపం,  తిమ్మరుసు,  గమనం వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమాలో తిమ్మరుసు, ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

  ఇలా ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలను సాధించాయి,  ఇది ఇలా ఉంటే ఆ మధ్య ప్రియాంక జవాల్కర్ కారోనా తో కాస్త ఇబ్బంది పడింది.  దాదాపు రెండు వారాల పాటు ప్రియాంక జవాల్కర్ కరోనా కారణంగా ఇంట్లోనే ఉండవలసి వచ్చింది,  ఆ సమయంలో ప్రియాంక జవాల్కర్ తన అభిమానులతో టచ్ లోనే ఉంటూ వచ్చింది.  ప్రియాంక జవాల్కర్ అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటిస్తూ వచ్చింది,  క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ప్రియాంక జవాల్కర్ సమాధానం ఇస్తూ వచ్చింది.  ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియాంక జవాల్కర్ తన అభిమానులతో  ముచ్చటించింది,  అందులో భాగంగా ఓ నెటిజన్ తిరుపతి కి మళ్లీ ఎప్పుడు వస్తున్నావ్ అని ప్రియాంక జవాల్కర్ ను అడిగేశాడు. అయితే ఆ ప్రశ్నకు ప్రియాంక జవాల్కర్ సమాధానం ఇచ్చింది,  నేను మిస్ అవుతున్న ఏకైక ప్రదేశం...  గత రెండేళ్లుగా అక్కడికి రావాలని ఎదురుచూస్తున్నానంటూ తన మనసు లోని కోరికను ప్రియాంక జవాల్కర్ బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: