సాధారణంగా హీరోలందరికీ ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక మరికొంత మంది హీరోల కైతే ఎక్కువగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇలాంటి సమయంలో ఎంతో మంది అమ్మాయిలు వారికి నచ్చిన హీరోలు బయట కనిపిస్తే చాలు.. వారితో కలిసేందుకు అవకాశం వస్తే వెంటనే సెల్ఫీ దిగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో బాలీవుడ్ హీరో లవర్ బాయ్ గా పేరు పొందిన కార్తీక్ ఆర్యన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


హీరో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించారు. ఇక ఈ హీరో కి కూడా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్నదని చెప్పవచ్చు. ఈ హీరో అలా బయట కనపడితే చాలు ఒక్కసారి గా అభిమానులు ఎగబడటంతో పాటు సెల్ఫీలు దిగడం జరుగుతూ వస్తోంది. తాజాగా హీరో కార్తీక్ ఒక వెకేషన్ కోసం గోవా కి వెళ్లడం జరిగింది.. గోవా నుండి ముంబై కి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ముంబై ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్తుండగా అతనిని గుర్తించిన ఇద్దరు అమ్మాయిలు.. తన కోసం గులాబీ పూల ను తీసుకువచ్చి ఆయన వెంట పడడం జరిగింది.ఈ విషయాన్ని గమనించిన కార్తీక్ వారి దగ్గర నుండి ఆ పూలను తీసుకోవడమే కాకుండా వారితో కలిసి ఫోటోలను కూడా దిగడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఫోటోలు మాధ్యమిక లో వైరల్ గా మారాయి. ఈ విషయంపై కొంతమంది నెటిజన్ల స్పందిస్తూ కార్తీక్ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా బాలీవుడ్ హీరో పై కూడా మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: