టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాస్ సినిమాలు చేసే దర్శకులకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. కమర్షియల్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడే మన హీరోలు అలాంటి సినిమాలు చేసే దర్శకులకే ఛాన్స్ లు ఇస్తూ ఉంటారు. అలా మన టాలీవుడ్ పరిశ్రమలో ఈ సినిమాలు చేసే దర్శకులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారిలో మాస్ సినిమా అంటే ఇలా చేయాలి అని ఓ స్టాంపు వేసిన దర్శకుడు వి.వి.వినాయక్. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించాయో అందరికీ తెలిసిందే.

ఆయన దర్శకత్వం వహించిన ఆది సినిమా దగ్గర నుంచి మొన్నటి ఖైదీ నెంబర్ 150 సినిమా వరకు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి అయన సినిమాలు. అలా ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు వినాయక్. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. చత్రపతి సినిమా ను అక్కడ రీమేక్ చేస్తున్న ఈ దర్శకుడు త్వరలోనే మరొక తెలుగు సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు. పెద్ద హీరో తోనే ఆయన తన తదుపరి సినిమా చేస్తున్నడు అని చెబుతూ ఉండటం విశేషం.

తాజాగా ఆయన ఓ మీడియాతో ముచ్చటించారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న మాస్ దర్శకులలో ఎవరు అంటే మీకు బాగా ఇష్టం అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన బాబీ పేరు చెప్పడం విశేషం. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ రచయిత మాస్ పల్స్ ను పట్టుకుని ప్రేక్షకులకు దగ్గరవడం లో సక్సెస్ అయ్యాడు. మాస్ సినిమా అంటే ఇలానే ఉండాలి అనే విధంగా ఆయన సినిమాలు చేసి మాస్ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఆయన సినిమా చేస్తూ ఉండడం విశేషం. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అతి తక్కువ మంది దర్శకులు ఉన్న నేపథ్యంలో వారిలో ఈ దర్శకుడు లో చోటు సంపాదించుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: