తెలుగు ప్రేక్షకులకు మరో శుభవార్త వచ్చేసింది. అందులోనూ ఈ వార్త మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కు లడ్డు లాంటి శుభవార్త. రవితేజ తాజా చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ" రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. జూన్ 17 న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు అనౌన్స్ చేసింది ఈ సినిమా చిత్ర బృందం. ఈ వార్త విని అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రవితేజ అభిమానులకు ఎట్టకేలకు కోరుకున్న గుడ్ న్యూస్ వినించింది టీమ్. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ఫుల్ జోష్ పై ఉన్న విషయం తెలిసిందే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

అయితే ఈ మధ్య విడుదలైన ఖిలాడీ మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రవితేజ కంగుతిన్నాడు. అందుకే ఇప్పుడు రాబోయే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే రవితేజ సినిమాలు ఫలితం తో సంబంధం లేకుండా డిమాండ్ మార్కెట్ లో పెరుగుతూ ఉంది. దాంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు ఆమధ్య టాక్ వినిపించింది. ఇక రవితేజ సినిమాలకు మ్యూజిక్ మ్యాజిక్ బాగానే వర్కౌట్ అవుతోంది. అందులోనూ రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి ముందు నుండి మంచి హైప్ ఉంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్, పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చి అట్రాక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.

మరి రంగంలోకి దిగేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది చూడాలి. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ కి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్’గా  'మజిలీ' ఫేమ్ 'దివ్యాంశ కౌశిక్' మరియు  రజిషా విజయన్ లు హీరోయిన్ లుగా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: