సమంత తన విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఇంతకు ముందు కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు సామ్ అడిగిన వాటికి అడగనివాటికి ఆన్సర్ చేస్తూ..నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత..తన భర్త నాగచైతన్య కు విడాకులిచ్చేసి వేరు గా సింగిల్ గా ఉంటుంది.ఇదిలావుండగా టాలీవుడ్ ది బెస్ట్ రొమాంటిక్ కపుల్ అనిపించుకున్న ఈ జంట విడిపోవడానికి కారణాలు చాలా నే వినిపించాయి. అయితే సోషల్ మీడియాలో చాలా దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు.

అంతేకాదు కొందరు అయితే సమంత కి తన పరసనల్ స్టైలిస్ట్ అంటే ప్రీతమ్ జుకల్కర్ తో అఫైర్ ఉందని..ఇక అందుకే నాగ చైతన్య సమంత కు విడాకులు ఇచ్చాడని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే ఇక ఎట్టకేలకు దీని పై రియాక్ట్ అయిన ప్రీతమ్ జుకల్కర్ .. సమంత నాకు అక్క అవుతుందని..మా మధ్య అలాంటి చీప్ సంబంధం అంటకట్టదు అని చెప్పుకొచ్చారు.అయితే కొన్ని రోజులు హాట్ టాపిక్ గా నడిచిన ఈ వ్యవహారం ..ఇక ఆ తరువాత సైలెంట్ అయిపోయింది.ఇకపోతే  మధ్య మధ్యలో వీళ్ళే లేనిపోని పోస్ట్ లు పెడుతూ..వాళ్ల మధ్య ఏదో సంబంధం ఉంది అనేలా ప్రూవ్ చేసుకుంటున్నారు.

అయితే  తాజాగా మరోసారి అలాంటి పోస్ట్ నే పెట్టింది సమంత. ఇక 'రీసెంట్ గా తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కి హెయిర్ కట్ చేసింది సమంత. కాగా దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెడుతూ..'నేను మల్టీటాలెంటెడ్ అని సమంత ప్రీతమ్ హెయిర్ కట్ చేస్తున్న పిక్ తో పాటు..నువ్వు నాకు ఈ పని చేసినందుకు డబ్బులు ఇవ్వలేదు' అంటూ రాసుకొచ్చింది. అయితే దీంతో సమంత పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇకపోతే మీ మధ్య తప్పుడు వార్తలు వస్తున్నప్పుడు దూరంగా ఉండచ్చుగా..ఇలాంటి చెత్తపనులు ఎందుకు సామ్ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాగా దీంతో సమంత వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: