బాహుబలి సిరీస్ తర్వాత యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, టాలీవుడ్ బ్యూటీ శ్రియ ఇంకా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ కూడా కొన్ని కీలక పాత్రలు పోషించారు.ఎన్నో అంచనాల మధ్య ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా మొత్తం 10 వేలకు స్క్రీన్స్‌లో విడుదలైంది.దాదాపు రూ. 500 కోట్ల పైగా భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో మధ్య ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా విడుదలైంది. ఈ సినిమాతో రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ మ్యాజిక్ మళ్ళీ చేశాడు. ఎవరి నోట విన్నా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే ఇప్పుడు చర్చ నడుస్తుంది. సూపర్ హిట్ అని చాలా మంది ప్రేక్షకులు అంటున్నారు. ఒక్కొక్కరు తమదైన శైలిలో ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన కొంతమంది ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమతమ అభిప్రాయాల్ని పంచుకుని చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా తెలిపారు.


భారత సినీ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై స్పందించారు. ‘ఇప్పటి నుంచి నాన్ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటి దాకా రికార్డ్స్ అన్నిటిని కూడా బాహుబలితో పోల్చారు కదా.. ఇకపై వాటిని ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పోల్చండి అని శోభు యార్లగడ్డ పరోక్షంగా పేర్కొన్నారు. నాన్ ఎస్‌ఎస్‌ఆర్ రికార్డ్స్ అని కూడా ఆయన మరో ట్వీట్ చేశారు.‘బాహుబలి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభు యార్లగడ్డ ఇంకా ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి రెండు భాగాలు రికార్డులు కొల్లగొట్టాయి. బాహుబలి 2 సినిమా తర్వాత ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను అసలు బ్రేక్ చేయలేదు. స్టార్ హీరోల రికార్డులను కూడా ఆ సినిమాల దర్శక నిర్మాతలు ‘నాన్ బాహుబలి’ రికార్డులు అని మాత్రమే పేర్కొనేవారు. బాహుబలి సినిమా తర్వాత ఇండస్ట్రీ హిట్ అనే మాటలు పక్కనపెట్టేసి.. నాన్ బాహుబలి రికార్డ్స్ అనే కొత్త పదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: