టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు నాగ చైతన్యతో విడాకుల తరువాత కూడా క్రేజ్ ఇంకా పెరిగిందే కాని అసలు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక సమంత క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికి బ్రాండ్లు ఆమె వెంట నడుస్తున్నాయా లేక ఆమె బ్రాండ్ల వెంట పడుతుందా అనేది తెలియదు కానీ.. వారానికో కొత్త బ్రాండ్ ప్రకటనతో సామ్ బాగా సందడి చేస్తోంది.తాజాగా స్పోర్టింగ్ యాప్ 'డ్రీమ్ 11' ఇంకా 'ఫార్చ్యూన్' సన్ ఫ్లవర్ ఆయిల్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత నియమించబడింది. దీని కోసం ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి.కొన్ని వారాల క్రితం సామ్ 'బ్లెండర్స్ ప్రైడ్ సౌత్' ఇంకా 'ఫాంటా' ప్రకటనలలో కనిపించింది. అంతకు ముందు 'మామఎర్త్' బ్రాండ్ ఆమెతో జతకట్టడం జరిగింది. వీటితో పాటుగా మరికొన్ని కంపెనీలు కూడా సామ్ ను ప్రచారకర్తగా నియమించుకుంటున్నాయి.


ఇండస్ట్రీలో మంచి గ్లామరస్ క్వీన్ గా వెలుగొందుతున్న సమంతకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ ఉండటం ఇంకా అలాగే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నందున రోజురోజుకూ ఆమె బ్రాండ్ వాల్యూ బాగా పెరుగుతోందని స్పష్టంగా అర్థం అవుతోంది.సమంత నటించే సినిమాలు కూడా మంచి వసూళ్లను సాధిస్తున్నందున ఆమెని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం తప్పకుండా ఆ బ్రాండ్లకు సహాయం చేస్తుందని భావించవచ్చు. ఇక ఏది ఏమైన సమంత ఇప్పుడు ఇటు సినిమాలు అటు యాడ్స్ తో రెండు చేతులా బాగానే సంపాదిస్తోంది.ఇక సమంత ప్రధాన పాత్రలో సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


ప్రస్తుతం 'యశోద' అనే మరో బహుభాషా సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.ఇక 'కణ్మణి రాంబో ఖతీజా' అనే సినిమాని విడుదలకు రెడీ చేసింది. ఇంకా అలాగే ఈ హాట్ బ్యూటీ చేతిలో 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అలానే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సమంత ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: