సినిమా పరిశ్రమలోనైనా కొన్ని కొన్ని కాంబో లు ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రభాస్ మరియు అనుష్క ఇద్దరు ఎన్ని సినిమాల్లో కలిసి నటించిన ప్రేక్షకులకు తనివి తీరదు. వారిద్దరూ కలిసి మొదటగా మిర్చి సినిమాలో నటించగా ఆ తర్వాత బాహుబలి సినిమా లో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిపై భారీ రూమర్స్ వచ్చాయి. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రస్తుతం డేటింగ్ లలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ అందులో వాస్తవం లేదని వారే చెప్పారు.

ఏదేమైనా సినిమాల పరంగా వీరు బెస్ట్ జోడి అని చెప్పవచ్చు. ఒకరికి తగ్గట్టు ఒకరు ఉంటారు. అలా వీరి జోడి స్క్రీన్ పై కనపడి చాలా రోజులయిన నేపథ్యంలో మళ్ళీ వీరి జోడి ప్రేక్షకులను అలరించాలని కొంతమంది వీరి అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల సంఖ్య భారీగానే ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఈ హీరో త్వరలోనే మారుతి దర్శకత్వంలో ఓ చిన్న సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా లో ముగ్గురు కథానాయికలకు ఛాన్స్ ఉండగా ఒక కథానాయిక గా ఈమెను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.

భాగమతి సినిమా తర్వాత అనుష్క ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఒకే చేసింది లేదు. మార్కెట్ ఉన్నా కూడా సినిమాలు ఎందుకు చేయడం లేదో తెలీదు కానీ అనుష్క మాత్రం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నట్లే ప్రవర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ సినిమాలో వచ్చిన ఛాన్స్ ను వినియోగించుకుని మళ్ళీ గెట్ బ్యాక్ అవుతుందా లేదా నటించకుండా మరింత కనుమరుగైపోతుంది అనేది చూడాలి. ప్రస్తుతం చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సలార్ సినిమా ను పూర్తి చేసి వెంటనే ఈ మారుతి స్మాల్ ప్రాజెక్ట్ లో పాల్గొంటాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. మరి అనుష్క ఈ లోపు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: