పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అడుగుపెట్టి మొదట మెగా ఫ్యామిలీ సోదరుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగు పెట్టినప్పటికీ.. తన సొంత ప్రతిభతో నటనతో ప్రేక్షకులను మెప్పించి దేశ విదేశాలలో సైతం ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తప్ప మరెక్కడా కూడా సినిమాలలో నటించలేదు. కానీ ఈయన నటించిన సినిమాలు వివిధ భాషలలో రీమేక్ కావడంతో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన క్రేజ్ లభించింది.


పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి లాగే ఇటీవల కాలంలో ఆయన అన్ని కూడా రీమేక్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ ఎంట్రీ చేసిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అమితాబచ్చన్ హిందీ లో నటించిన పింక్ సినిమా రీమేక్ గా  వకీల్ సాబ్ సినిమాను  విడుదల చేశారు. ఈ సినిమా విజయం తరువాత ఆయన మరొకసారి మలయాళం సినిమా అయినటువంటి అయ్యప్పనుమ్ కోషియుమ్ నుంచి రీమేక్  చేయబడ్డ భీమ్లా నాయక్ సినిమా ను విడుదల చేసి టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా సరే కొన్ని కోట్ల రూపాయల షేర్ని వసూలు చేశారు.


ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో ఉంటూనే.. ఇప్పుడు తమిళ సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు.
వినోదయ సీతమ్ సినిమా రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించారు. దర్శకుడు సముద్రఖని తాను స్క్రిప్ట్‌ను పవన్ స్థాయికి సరిపోయేలా ట్యూన్ చేసినట్లు  సముద్రఖని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: