మునుపెన్నడూ లేని విధంగా గోపీచంద్ కెరీర్ ఇప్పుడు చాలా ప్రమాదంలో పడింది. ఆయన వరుసగా సినిమాలు చేయడమే దీనికి కారణం. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న సీటీ మార్ చిత్రం కూడా కాపాడలేకపోయింది. ఆ విధంగా ఈ చిత్రం ఆయనకు ఇమేజ్ పరంగా కూడా ఏమాత్రం ఉపయోగపడలేదు. ఏదేమైనా గోపీచంద్ కథ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ఇప్పుడు ఆయన చేయబోతున్న  పక్కా కమర్షియల్ సినిమా పై ఎంతగానో ఒత్తిడి ఉంది.

మారుతి దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమా గోపీచంద్ కు తప్పకుండా భారీ విజయాన్ని తెచ్చి పెట్టవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే ఆయన కంటే వెనకాల వచ్చిన హీరోలు సైతం ప్రేక్షకులను ఆలచిస్తూ భారీ హిట్ లు సాధిస్తూ పోతుంటే ఈ హీరో మాత్రం మినిమం విజయాలను అందుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. ఆ విధం గా ఇప్పుడు ఆయన మారుతి సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం జూలై 1వ తేదీన విడుదల కాబోతున్నట్లూ అధికారిక ప్రకటన రాగా ఇప్పుడు ఈ సినిమా సరైన సమయంలోనే విడుదల జరుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

జూలై నెలలో ఎక్కువ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో తప్పకుండా ఈ సినిమా కు మంచి తేదీ పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ లు రాబోతున్నాయని తెలుస్తుంది. మరి మంచి సినిమాలు చేసి హిట్లు అందుకున్న దర్శకుడు మారుతీ ఈ చిత్రంతో ఏ స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకునీ గోపీచంద్ కు మంచి విజయాన్ని అందిస్తున్నాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తరువాత మారుతి ప్రభాస్ తో సినిమా చేస్తుండగా గోపీచంద్ కూడా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఎలాంటి సక్సెస్ ను చూస్తారో మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: