ఇక రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, పెట్రోల్ టూవీలర్లను కొనేందుకు కస్టమర్లు కూడా అసలు ఆసక్తి చూపడం లేదు. దీంతో గత నెలలో టీవీఎస్ కంపెనీ అమ్మకాలు కూడా బాగా క్షీణించాయి. వాస్తవానికి టీవీఎస్ టూవీలర్ మోటార్ బైక్స్ అంటేనే మైలేజ్‌కి పెట్టింది పేరు. ఇప్పుడు అలాంటి బ్రాండ్ టూవీలర్లను కొనేందుకు కూడా కస్టమర్లు బాగా వెనక్కి తగ్గుతున్నారు. గడచిన మార్చి 2022 నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 3,07,954 యూనిట్ల వాహనాలను (ద్విచక్ర వాహనాలు ఇంకా త్రీ వీలర్లతో కలిపి) అమ్మింది. మార్చి 2021 నెలలో కంపెనీ అమ్మిన 3,22,643 యూనిట్లతో పోలిస్తే, ఇప్పుడు ఇవి 4.6 శాతం క్షీణించాయి.భారతదేశంలో టీవీఎస్ అమ్మిన టూవీలర్ అమ్మకాలను గమనిస్తే, మార్చి 2022లో ఇవి 1,96,956 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, గత సంవత్సరం మార్చిలో అమ్మిన 2,02,155 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ దేశీయ అమ్మకాలు 2.6 శాతం తగ్గడం జరిగింది.



అయితే, గత నెలలో మోటార్‌ బైక్స్ అమ్మకాలు మాత్రం 2.05 శాతం పెరిగాయని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. గత నెలలో కంపెనీ మొత్తం 1,60,522 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మగా, గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 1,57,254 యూనిట్ల మోటార్‌సైకిళ్లను అమ్మింది.అయితే, టీవీఎస్ స్కూటర్ అమ్మకాలు మాత్రమే తగ్గుముఖం పట్టాయి. గత నెలలో టీవీఎస్ స్కూటర్ల అమ్మకాలు 9.8 శాతం క్షీణతను రిజిస్టర్ చేశాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ మార్చి 2022లో మొత్తం 94,747 యూనిట్ల స్కూటర్లను అమ్మగా , గత సంవత్సరం మార్చిలో కంపెనీ 1,04,513 యూనిట్ల స్కూటర్లను అమ్మింది. కరోనా వైరస్ మహమ్మారి వలన ఏర్పడిన సెమీకండక్టర్ల చిప్ కొరత కారణంగా ప్రీమియం ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ఇంకా అలాగే విక్రయాలపై ప్రభావం పడిందని కంపెనీ పేర్కొంది. అయితే రానున్న నెలల్లో సరఫరాలో మెరుగుదల ఉంటుందని టీవీఎస్ మోటార్ బైక్ కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TVS