సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అటు క్రికెటర్లకు కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియా లో క్రేజ్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అటు సినిమా రంగానికి అటు క్రీడా రంగానికి చెందినవారు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ఎప్పుడూ ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. గతంలో టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రిలేషన్ షిప్  లో కొనసాగుతున్నారని మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక తీరా చూస్తే జస్ప్రిత్ బూమ్రా స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా ను పెళ్లి చేసుకున్నాడు.


 ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.. విజయ్ దేవరకొండ సరసన నటించిన  హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఇక ఇటీవలే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ తో ప్రేమలో మునిగితేలుతోంది అంటు ఒక వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. టాలీవుడ్ లో టాక్సీవాలా  సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ ఇక మొన్నటికిమొన్న ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలో కూడా నటించింది. వరుస అవకాశాలు అందుకుంటూ ఇది బిజీగానే గడుపుతుంది ప్రియాంక జవాల్కర్. ఈ అమ్మడు భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ తో డేటింగ్ లో ఉందట.



 ఇటీవలే ప్రియాంక జవాల్కర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో పై వెంకటేష్ స్పందిస్తూ క్యూట్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక వెంకటేష్ హయ్యర్ రిప్లై పై స్పందించిన ప్రియాంక జవాల్కర్  హు యు అంటూ రిప్లై ఇచ్చింది.  అంతేకాదు ఇక సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉండటం గమనార్హం.. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని డేటింగ్లో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం వీరిద్దరూ క్లారిటీ ఇస్తే గాని తెలియదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl