టాలీవుడ్ హాట్ హీరోయిన్ సమంత క్రేజ్ రోజు రోజుకి బాగా పెరిగిపోతుందనే చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ.. దీపిక పదుకొనే లాంటి ఫ్యాషనిస్టాలకు ధీటుగా సౌత్ లో సమంత ఫ్యాషనిస్టా వైబ్స్ తో వెలిగిపోతున్న విషయం తెలిసిందే. సీనియర్ స్టార్లను కూడా ఇమ్మిటేట్ చేస్తున్నా సమంత తనదైన యూనిక్ నెస్ బ్యూటీతో తెలుగు ఫిలింసర్కిల్స్ లో ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.సమంత సెలక్ట్ చేసుకునే బ్రాండ్స్ యాక్సెసరీస్ సహా ప్రతిదీ కూడా యూనిక్ గా ఉండేలా ఆమె తీసుకునే శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇటీవలి వ్యక్తిగత ఒడిదుడుకుల తరువాత సమంత తనలోని గ్లామర్ ఎలివేషన్ హద్దులు చెరిపేస్తోందన్న గుసగుస బాగా వినిపిస్తోంది. ఊ అంటావా .. సాంగ్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక సమంత మరింతగా చెలరేగిపోతోందని ఫ్యాన్స్ లో కూడా చర్చ అనేది సాగుతోంది.




ఇక ఇదిలా ఉండగానే సమంత ప్రముఖ మ్యాగజైన్ కవర్ షూట్ లో పెద్ద దుమారం రేపింది. సామ్ టూ హాట్ లుక్ తో తన ఫాలోవర్స్ ఇంకా అలాగే ఫ్యాన్స్ మతులు చెడగొట్టింది. ఈ సిరీస్ లో కొన్ని త్రోబ్యాక్ ఫోటోలను ఆమె షేర్ చేస్తూ ఫ్రెష్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది.ఇక తను షేర్ చేసిన ఇన్ స్టా గ్రామ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సమంత నియాన్ కలర్ లూజ్ టాప్ లో తన ఇన్నర్ హాట్ బ్యూటీని ఎలివేట్ చేసిన తీరు అయితే యూత్ మతులు చెదరగొట్టింది. ఫ్లోరల్ బాటమ్ కి అనుసంధానంగా సామ్ ఆ టాప్ ని సెలెక్ట్ చేసుకుంది.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే..ఏప్రిల్ 28 వ తేదీన సమంత నటించిన `కాతు వాకుల రెండు కాదల్` సినిమా రిలీజ్ అవుతుంది. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించగా.. విజయ్ సేతుపతి ఇంకా నయనతార జంటగా నటించారు. ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: